Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ-అర్వపల్లి
రైతులకు ఆయిల్ఫామ్ పంటపై ప్రత్యేక అవగాహన కల్పించి తద్వారా పంటను పండించి అధిక దిగుబడులు వచ్చేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ అన్నారు.మంగళవారం ఆయన మండలకేంద్రంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం నీటి కొరతకు ఇబ్బంది లేదని, 50 ఎకరాలకు పైగా నర్సరీల్లో హార్టికల్చర్ ద్వారా ఆయిల్ ఫాం మొక్కలను సాగు చేయొచ్చన్నారు.తద్వారా నియోజకవర్గంలో కంపెనీని ఏర్పాటు చేయొచ్చని,తద్వారా రైతుల్లో అమ్ముకోవడం కొనడం ప్రత్యక్ష,పరోక్ష పద్ధతిలో అధికలాభాలు పొందవచ్చన్నారు.అధికారులు ప్రత్యేకదష్టి సారించి రైతులకు గ్రామాల వారీగా ప్రత్యేకసదస్సును ఏర్పాటు చేసి పంట పండించే విధంగా చూడాలన్నారు.అంతకుముందు ఆయన మండలకేంద్రంలోనూ,మండలంలోని కాసర్లపహాడ్,అర్వపల్లి ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో నూతనపనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే వివిధ శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.తిమ్మాపురం-సంగెం వరకు వర్షం వచ్చినప్పుడు రాకపోకలు ప్రజల ఇబ్బందులు తొలగిపోవడానికి నూతనంగా రూ.17 కోట్లతో బిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు.గ్రామాల్లో నాటుసారా ఏర్పాటు చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని శాఖ ఎక్సైజ్ ఎస్సైని ఆదేశించారు.మండల కేంద్రంలో నూతన పశువైద్యశాల నిర్మాణం ఏర్పాటు చేస్తానన్నారు.మండల పరిధిలోని చాకులగూడెం గ్రామంలో ప్రజలకు నీటి కొరత ఇబ్బంది తీర్చాలని మండల కోఆప్షన్ సభ్యులు హమీద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.సంబంధిత శాఖ అధికారులను వివరణ అడిగి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు.ప్రత్యేక అధికారి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా వెంటనే తన దష్టికి తీసుకువచ్చి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్,వైస్‌ఎంపీపీ మారిపెద్ది భవాని, పీఏసీఎస్‌చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, అధికారులు, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, ఎంపీడీఓ విజయ పాల్గొన్నారు.