Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివక్ష రూపుమాపినప్పుడే అభివృద్ధి
- మిర్యాలగూడలో నత్యరూపనాటకం
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రతి ఒక్కరూ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంఘం చరణం గచ్చామి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాటికను, వారి జీవిత చరిత్రను కొంత భాగం నత్యరూపకం, నాటకంరూపంలో సోమావారం రాత్రి ప్రదర్శన వేశారు.ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో వివక్ష రూపంలో కులాల మధ్య, మత్యాల మధ్య వివక్ష చూపించి మనుషులను విడదీసే పద్ధతుల్లో మనువాద సంస్కృతిని, దేశంలోఉన్న సంప్రదాయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ చూపిస్తుందన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన తరగతులకు న్యాయం కోసం ఆనాడు నుండి అనేక పోరాటాలు చేశారన్నారు.అనేక వివక్షలకు గురైన మహానుభావుడన్నారు.మతంపేరుతో, కులంపేరుతో విడదీస్తూ నాయకులు రాజకీయలబ్ధి కోసమే ఎస్సీ కులాలకు చెందిన వాళ్లను వాడుకుంటున్నారని విమర్శించారు.ఆయనచూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ ప్రపంచానికి మార్చ్ అనే మేధావి కార్మికులకు, కర్షకులకు, వెనకబడిన తరగతులకు ఈ ప్రపంచానికి మార్గాన్ని చూపించారన్నారు.దళితులపై జరుగుతున్న దాడులను ఎండగట్టాలని కోరారు.అందరికీ కూడు, గుడ్డ, వైద్యం, విద్య ప్రజలందరికి అందిన నాడే అంబేద్కర్ ఆశయాలు సాధించినట్టవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దోస్పాటి శ్రీను, ఎస్సీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీను, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుశరాములు, కెేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు కోటిరేఖ మల్లయ్య దైెద దేవయ్య, కోడిరెక్క రాధిక, దైద జనార్దన్, బొంగరాల వెంకటయ్య, తక్కెళ్లపల్లి ఏసుబాబు, బొల్లంపల్లి పాపారావు, రవి తదితరులు పాల్గొన్నారు.