Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
సంపద సష్టిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హమాలీ ట్రాన్స్‌పోర్టు భవన నిర్మాణం , ఇతర అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూజిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో భవన నిర్మాణం హమాలీ ట్రాన్స్‌ఫోర్టు రంగాల కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న హమాలీ కార్మికులకు చాలీచాలని వేతనాలు వస్తున్నాయని ఎలాంటి సామాజిక భద్రత లేదని తెలిపారు. రవాణా రంగ కార్మికులకు పెరిగిన డీజిల్ ,పెట్రోల్ ధరలు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ రోడ్ టాక్స్ లైసెన్స్ ఫీజులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలుతున్నట్టుగా పోలీస్ ఆర్టిఏ వేధింపులతో కార్మికుల బతుకులు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మాణరంగ కార్మికులకు సిమెంట్ స్టీల్ ఇసుక ధరలు పెరగడంతో పని దినాలు పడిపోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసంఘటితరంగా కార్మికుల సంక్షేమానికి ఒక బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తదితర సామాజిక భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న చలో నల్గొండ డీసీఎల్ కార్యాలయం ముట్టడి, ఆగస్టు 3న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ యాసరాని శ్రీనివాస్, నాయకులు వరికుప్పల ముత్యాలు, వివిధ రంగాల కార్మికులు యాసరాని వీరయ్య, పందుల యాదయ్య ఏర్పుల యాదయ్య, నగేష్ గాదపాక అంజయ్య ,రామలింగమ్మ దితరులు పాల్గొన్నారు.