Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి అపజయం విజయానికి పునాది
- ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం అభినందనీయం
- ప్రత్యమ్నాయా మార్గాలు పుష్కలం-మంత్రి జగదీశ్ రెడ్డి
- 2300 మందికి ఉచితంగా మెటీరియల్ పంపిణీ
నవతెలంగాణ -నల్లగొండ
ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులకు ఆత్మన్యూనతా భావం వలదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్బోధించారు. ప్రతి అపజయం విజయానికి పునాది అవుతుందన్న వాస్తవాన్ని యువత గ్రహించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం అభినందనీ యమని,కానీ జీవితానికి ప్రభుత్వ ఉద్యోగమే పరమావధి కాకూడదని చెప్పారు. మంత్రి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ టీఆర్ఎస్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న 2300 నిరుద్యోగ యువతీ, యువకులకు స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన మెటీరియల్ ను సోమవారం రాత్రి పంపిణీచేసి మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక వైద్య విద్య చదివేందుకు ఇబ్బంది పడుతున్న దళిత విద్యార్థిని ధరణికి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల నగదును అందజేశారు. అనంతరం శాసనసభ్యులు భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ నేటి యువతరం క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవలన్నారు.ఉపాధి కోసం ప్రత్యమ్నాయా మార్గాలు కోకొల్లలు ఉన్నాయన్నారు.ఉద్యోగ ప్రయత్నం తో పాటు ఉపాది అవకాశాలను అన్వేషించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కుడా అదే నని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కష్ణారెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్‌్ మందడి సైదిరెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నల్లగొండ కనగల్ తిప్పర్తి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఆరధ్యా దైవం...
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకుఆరాధ్య దైవమని ఆయన ఆశిషులతో ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆశీస్సులు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే విదంగా తనను ఆశీర్వదించిన రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లతో పాటు సహచర మంత్రులు,శాసనసభ్యులకు,పార్లమెంట్ సభ్యలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.