Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
గతంలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలను క్రీడామైదానం, పల్లెప్రకృతివనం పేరిట తీసుకోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.గురువారం మండలంలోని కరక్కాయలగూడెంలో పార్టీ మండల కమిటీ సభ్యులు చింతకుంట్ల వీరయ్య సతీమణి పద్మ దశదినకర్మకు హాజరయ్యారు.అనంతరం బూరుగడ్డ గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడారు.2005లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితులకు 9 ఎకరాల భూమిని ఇప్పించానన్నారు.మళ్లీ ఆ భూమిని పల్లెప్రకృతివనం, క్రీడామైదానం, డంపింగ్ యార్డు వంటి అవసరాల కోసం వెనక్కు తీసుకోవడం హేయమన్నారు.బూరుగడ్డ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి నాలుగేండ్లవుతున్నా ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు.వెంటనే అర్ములందరికీ ఇండ్లు పంపిణీ చేయాలని కోరారు.గ్రామంలో సీసీరోడ్లు, తాగునీరు, మౌలికవసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మం, పోసనబోయిన హుస్సేన్, మండల కమిటీ సభ్యులు రాములు, వీరబాబు, మురళి, శ్రీను, వీరమల్లు, మాధవరావు, ఆవులసైదులు, రాజు, కిషోర్ పాల్గొన్నారు.