Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్మాక్స్ చైర్మెన్ గంగుల కష్ణారెడ్డి
నవతెలంగాణ -ఆలేరు టౌన్
కేంద్ర ప్రభుత్వం పాడి రైతులపై విధించిన జీఎస్టీ వెంటనే ఉపసంహరించుకోవాలని నార్మాక్స్ ఉమ్మడి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల చైర్మెన్ గంగుల కష్ణారెడ్డి డిమాండ్చేశారు. మండల కేంద్రంలో గురువారం పాలశీతలీకరణ కేంద్రం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తిపై జీఎస్టీ పన్ను విధించడం హేయమైన చర్యన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై , పాలపై, పాల ఉత్పత్తులపై, 5 శాతం జీఎస్టీ విధించి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు .ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు కల్లెపల్లి శ్రీశైలం, దొంతిరి సోమిరెడ్డి, శ్రీకర్ రెడ్డి,ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య,జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఆడెపు బాల స్వామి,పీఏ సీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేష్ గౌడ్,కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నర్సిములు, సర్పంచ్లు ఆరుట్ల లక్ష్మి కాంత్ రెడ్డి,శ్రీశైలం,మొరిగాడి వెంకటేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సిములు,మాదానీ ఫిలిప్,పాశికంటి శ్రీనివాస్, జల్లి నర్సింలు, తదితరులు పాల్గొన్నారు .
భువనగిరి: సామన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై ముఖ్యంగా పాలపై,పాలు,పెరుగు ,పాల ఉత్పత్తులపై 5శాతం జిఎస్టీ, నిత్యవసర వస్తువుల పై జీఎస్టీ విధించి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం పట్టణకేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ, పట్టణ, మండల నాయకులు, , వివిధ చైర్మన్లు వైస్ చైర్మెన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ,కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మోటకొండూర్:కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు బొట్ల యాదయ్య, టౌన్ అధ్యక్షులు భూమండ్ల సుధీర్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్్ ఎగ్గిడి బాలయ్య, మార్కెట్ డైరెక్టర్ అనంతల జంగారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి బురాన్, యూత్ మండల అధ్యక్షులు బీసీ కష్ణంరాజు,దిలావర్ పూర్ గ్రామశాఖ అధ్యక్షులు చొప్పరి గణేష్, టౌన్ సెక్రెటరీ జనరల్ బొలగాని మోహన్, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : కేంద్ర ప్రభుత్వం పాలపై, పాల ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ ని పెంచడానికి నిరసిస్తూ మండల కేంద్రంలోనీ సుభాష్ సెంటర్ లో గురువారం టీిఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన జిఎస్టిని వెంటనే తగ్గించాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోష బోయిన మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గుత్తా నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, రేఖ యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ఎం : పాలఉత్పత్తుల, నిత్యవసర వస్తువుల పైన ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పైన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ , సర్పంచులు కోల సత్తయ్య గౌడ్,నాయిని నర్సింహారెడ్డి పార్టీమండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్, యాస రంగారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్లు కోరే భిక్షపతి, బీసు ధనలక్ష్మి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాయిని శశికళ రెడ్డి,గొట్టేటి శ్రీను,మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు.