Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి
- కలెక్టరేట్ సమావేశానికి హాజరైన సంస్థ సభ్యురాలు మంచు లక్ష్మి
నవ తెలంగాణ- భువనగిరిరూరల్
టీిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ద్వారా జిల్లాలోని 50 పాఠశాలలో ఎంపిక చేసి మూడు సంవత్సరాల పాటు మూడు స్థాయిలలో 1 నుండి 5 వ తరగతి వరకు గల పిల్లలకు చదువులో నైపుణ్యం కల్పించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బోధన కార్యక్రమన్ని వినూత్నంగా ప్రారంభించి, అమలు చేస్తున్నట్టు తెలిపారు. పిల్లలు బిగ్గరగా చదవడం తో వారికి చదువు పై ఆసక్తి పెరుగుతుందన్నారు. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు ఇంటి వద్ద చదివించి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తల్లిదండ్రుల బాద్యత బడికి పంపడమే మాత్రం కాదని వారి అలువాట్లను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని, చెడు అలవాట్లు, చెడు సావాసాలు చేయకుండా చూసుకోవాలన్నారు.
టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సభ్యురాలు మంచు లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన బోధన చాలా బాగుందని చదువు ఎక్కడో లేదని మన అందరి మధ్యలోనే ఉంటుందని, చదువును ఎవ్వరూ దొంగలించలేరని అన్నారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. తెలంగాణ లో విద్యలో మంచి కాంపిటీషన్ ఉందని పాఠశాలలో డ్రాప్ ఔట్స్ తగ్గించాలని అన్నారు. మూడు స్థాయిలలో 1 నుండి 5వ తరగతి పిల్లలకు విద్య నైపుణ్యం పెంచేందుకు స్మార్ట్ క్లాస్ రూమ్స్ యాదాద్రి జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు ఇందులో బాగంగా మొదటిగా పటేల్ గూడెం పాఠశాలను సందర్శించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్య శాఖ అధికారి నారాయణ రెడ్డి, టిచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సభ్యులు చైతన్య, కొ ఆర్డినేటర్ అండాలు, విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.