Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజలకు సేవలందించడంలో, పోలీసు పనిలో నైపుణ్యం, ప్రతిభ చూపి బాగా పని చేసే సిబ్బందికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.గురువారం జిల్లా పోలీసుకార్యాలయంలో జరిగిన పోలీస్ రివార్డ్ మేళా కార్యక్రమంలో సిబ్బందికి ఆయన కేపీఐ రివార్డులు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెట్రోకార్, బ్లూకొట్స్, కోర్టు డ్యూటీ, కమ్యూనిటీ పోలీసింగ్, సెక్షన్ ఇన్చార్జి, రిసెప్షన్, పిటిషన్ మేనేజ్మెంట్, ఇన్వెస్టిగేషన్, స్టేషన్ నిర్వహణ, డయల్ 100 స్పందన ఇలా అన్ని విభాగాల్లో పోలీసు పనితీరులో, సేవలందించడంలో చాలామార్పులు వచ్చాయన్నారు.ఎప్పటికప్పుడు నైపుణ్యంతో సేవలందించడంలో జిల్లా పోలీసు బాగా పని చేస్తుందని పేర్కొన్నారు.ప్రతి సందర్భాన్ని కచ్ఛితంగా సద్వినియోగం చేసుకుని ఉత్తమమైన సేవలందించాలని కోరారు.జిల్లాలో పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాల పనితీరులో ప్రతిభ చూపిన సిబ్బందికి వారి పని తీరు సూచిక ఆధారంగా రివార్డ్స్ ప్రకటించామన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్‌బ్రాంచి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సోంనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ, సీఐలు విఠల్‌రెడ్డి, ఆంజనేయులు, రాజేష్, నాగర్జున, మునగాల సీఐ ఆంజనేయులు,పీఎన్డీ ప్రసాద్, నర్సింహారావు, రామలింగారెడ్డి, ఐటీ కోర్,డీసీఆర్బీ ఎస్సైలు, స్టేషన్ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.