Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- భువనగిరి రూరల్
వీఆర్ఏలకు పేస్కెల్ జీవోను వెంటనే విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 9న శాసన సభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓ లను రద్దు చేసి వీఆర్ఏ లకు పే-స్కెల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ దాసరి వీరన్న , కో-చైర్మెన్ పసుల రమేష్ , జనరల్ సెక్రటరీ గోరుకంటి వెంకటేశం, కన్వీనర్ స్వామి జిల్లా సినీయర్ నాయకులు బోళ్ల బాషయ్య,గిరి వివిధ మండలాల అధ్యక్షులు పెంటయ్య,ఏడ్ల వెంకటేశం,గడ్డం శ్రీనివాస్, ఉషయ్య, మైసయ్య, కోట నర్సింహ,కష్ణ,శ్రీనివాస్, నాయకులు బోయిన నర్సింహ నాయకులు ధనలక్ష్మి, సంతోష ,సాయి,బిక్షయ్య నాయకులు బింగి శ్రీనివాస్, మాధవరెడ్డి, అర్జున్,జానీ పాల్గొన్నారు.