Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షులుగా మర్రి నాగేశ్వరరావు,జిల్లా ప్రధానకార్యదర్శిగా కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 20వ తేదీన జిల్లాకేంద్రంలోని సూర్యాపేట ఫంక్షన్హాల్లో సోమపంగు కిరణ్నగర్లో జరిగిన కేవీపీఎస్ జిల్లా ద్వితీయ మహాసభల్లో 25 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా మర్రి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోటగోపి, జిల్లా ఉపాధ్యక్షులుగా మీసాల వీరబాబు, డి దుర్గారావు, బోయిల్ల అర్జున్, పిండిగ నాగమణి,జిల్లా సహాయ కార్యదర్శిలుగా గుద్దేటి వెంకన్న, టేకుల సుధాకర్,నందిగామ సైదులు,దేవరకొండ యాదగిరిలను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా దోరేపల్లి వెంకటేశ్వర్లు, పరంగి కష్ణ,వెంకటేశ్వర్లు,సిద్దెల వెంకటయ్య,రాంబాబు, జంగపల్లి శ్రీను,కె రామకష్ణ, తాళ్లపాక సురేష్,పోలెపాక నగేష్,ముత్తయ్య,కొమ్ము విజరు,గండమల్ల భాగ్యమ్మ, ఇరుగు రమణ,బొడ్డుపల్లి వెంకటరమణ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ జిల్లాలోని దళితులందరికీ దళితబంధు అందించాలని కోరారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని, ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా నిధులు కేటాయించి దళితవాడల అభివద్ధి చేయాలని కోరారు.గ్రామాలలో ఇంకా కనబడని రూపంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు సమరశీల పోరాటాలు చేయాలని కోరారు.ఎస్సీ కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.500 కోట్లు కేటాయించాలని, దళితులపై జరుగుతున్న దాడులను,హత్యలను, అత్యాచారాలను అరికట్టాలన్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించే చట్టం చేస్తూ జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు. అర్హులైన దళితులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల కూలి ఇవ్వాలని మహాసభలో తీర్మానాలు చేసినట్లు తెలిపారు.