Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యం కావాలి
- అవాగ్దానాల అమలులో కెసిఆర్ ప్రభుత్వం విఫలం
- కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తుందని, రాజ్యాంగ రక్షణకు భారతీయులంతా ఐక్యమై దేశాన్ని రక్షించుకోవాలని, బీజేపీ విధానాలను ప్రతిఘటించడానికి యువతరం సిద్ధం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక సూర్యాపేట ఫంక్షన్హాల్లో జరిగిన ఆ సంఘం జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి దళితులకు అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు మహిళలపై దాడులు పెరిగాయన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను నడిబజార్లో అమ్ముతూ దేశభక్తి ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతుందన్నారు. రాజ్యాంగం రద్దు కోసం కుట్రలు చేస్తుందన్నారు.రాజ్యాంగ రక్షణ కోసం రాజకీయా లకతీతంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లలో అన్యాయం జరిగిందన్నారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రినాగేశ్వరరావు, నాయకులు పిండిగ నాగమణి అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టియాదగిరిరావు,వ్యవసాయ కార్మికసంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు, వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి సుందరయ్య, జిల్లా నాయకులు మీసాల వీరబాబు,దేవరకొండ యాదగిరి, బోయిళ్ళ అర్జున్, టేకుల సుధాకర్, నందిగామ సైదులు,దుర్గారావు,ఇరుగు రమణ,భాగ్యమ్మ,అబ్రహం,శ్రీను, కృష్ణ, నాగయ్య, దేవిక తదితరులు పాల్గొన్నారు.