Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న ఖిలాషాపురంలో సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలు
- జయప్రదం చేయాలని గీత కార్మికులకు పిలుపు
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణ
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజశ్రేయస్సు కోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం పనిచేసి అమరులైన త్యాగ మూర్తులను స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 18 వరకు గ్రామ గ్రామ గ్రామాన సామాజిక చైతన్యయాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహించాలని, ముగింపు ఉత్సవాలు జనగామ జిల్లా ఖిలషాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి రోజున ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంవీ.రమణ పిలుపునిచ్చారు.గురువారం స్థానిక ఏఎంఏ ఏసీ ఫంక్షన్హాల్లో ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతిఏడాది అమరజీవి బొలగాని పుల్లయ్య వర్థంతి రోజు నుండి సర్వాయి పాపన్న జయంతి వరకు అమరులయాదిలో పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు.కల్లుగీత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కషి చేస్తామన్నారు.కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మభిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు.జ్యోతిబాఫూలే, సావిత్రిబాయిఫూలే,పెరియార్రామస్వామి, అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు, సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారు చేసిన సేవలను ఈ తరానికి అందిస్తామన్నారు.ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం పోరాడి సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.సర్వాయి పాపన్న స్ఫూర్తితో దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడి శ్రామికరాజ్యం స్థాపనకు కషి చేస్తామన్నారు.రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈత, తాటి చెట్ల పెంపకం కోసం జీఓ 560 ప్రకారం ప్రతి సొసైటీకి ఐదెకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని లేనిచో ప్రభుత్వమే కొనివ్వాలని డిమాండ్ చేశారు.ఈత,తాటి చెట్లు నరికి వేసిన వారిపై నాన్ బెలేబుల్ కేసులు నమోదు చేయాలని,ఈత,తాటి చెట్లకు రక్షణ కల్పించాలని కోరారు.రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులందరికీ వత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు.ఏడాదిలో వత్తి ఆరు నెలలే ఉంటున్నందున మిగతా కాలం జీవించడానికి గీతన్నబంధు పేరుతో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు.ప్రతి జిల్లాలో నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గౌడ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు.మద్య నిషేధం దశలవారీగా అమలు చేయాలని పేర్కొన్నారు.50 ఏండ్లు పైబడిన వారికి నాలుగేండ్ల నుండి పెన్షన్ ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని కోరారు.అకాల వర్షాలతో చెట్లు ఎక్కకపోవడంతో గీత కార్మికులు నష్టపోయారని, వీరికి నష్టపరిహారం చెల్లించాలన్నారు.బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం ప్రతిష్ఠించాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్గూరి గోవిందు, వెంకటనర్సయ్య, బాలే వెంకటమల్లయ్య, గౌనివెంకన్న,రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమేశ్‌గౌడ్, చౌగాని సీతారాములు, బోలగాని జయరాములు. సహాయ కార్యదర్శులు బండకిందిఅరుణ్, గాలి అంజన్న, గౌరవ సలహాదారులు, భీమగాని చంద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జయమ్మ, నాయకులుఅబ్బగాని భిక్షం,అంజిబాబు, గుణగంటి కృష్ణ, తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగురాజేష్ పాల్గొన్నారు.