Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
పే స్కేలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం వీఆర్ఏలు కలెక్టరేట్ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలుపుతూ మాట్లాడారు .55 ఏండ్లు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రెండేండ్ల క్రితం ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నేటికీ ఆమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని , న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. లేని పక్షంలో వీఆర్ఏల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 23న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో వీఆర్ఏల జేఏసీ చైర్మెన్్ శ్రీనివాస్ జిల్లా జనరల్ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కోకన్వీనర్లు ప్రవీణ్ కుమార్ ,దుర్గాప్రసాద్ ,నాగయ్య ,శ్రీరాములు ,ఎలమంద రాధా ,మదుల ,ప్రణీత తదితరులు ఉన్నారు.