Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అరులైన పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 22న స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ పిలుపునిచ్చారు.గురువారం పట్టణంలోని సీపీఐ(ఎం) ఆయన విలేకర్లతో మాట్లాడారు.పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.8 ఏండ్ల పాలనలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు, రేషన్‌కార్డులు అందలేదని విమర్శించారు.పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినప్పటికీ ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.మిర్యాలగూడ పట్టణంలో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.నిర్మాణాలు పూర్తై మూడేండ్లవుతున్నా ఇప్పటివరకు లబ్దిదారులకు ఇండ్లు పంపిణీ చేయలేదన్నారు.దీంతో ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు.ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అరులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.రవినాయక్,డాక్టర్ మల్లుగౌతమ్‌రెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ, పరుశరాములు, అయ్యూబ్, లావుడి దేశీరాంనాయక్, చాంద్‌పాషా పాల్గొన్నారు.