Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
నిరుపేదలు సామాన్యులు నిత్యం వాడుకునే నిత్యావసర సరుకుల పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచిందని వెంటనే నిత్యావసర సరుకుల పై వేసిన జీఎస్టీ నీ ఉపసంహరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చినపాక లక్ష్మీ నారాయణ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు.పేదల జేబులు కొల్ల గొట్టి పెద్దల, కార్పొరేట్ వ్యాపారులకు మోడీ ప్రభుత్వం దాసోహం చేస్తుందని విమర్శించారు. పెట్టుబడి దారులకు, కార్పొరేట్ వ్యాపారులకు జీఎస్టీ తగ్గించి పేదలు కొనే పాలు, ఉప్పు,పప్పు, పుస్తకాలు, పెన్నులపై కూడా వదలకుండా అధిక ధరలు పెంచారని విమర్శించారు.దేశంలో మతోన్మాదం సష్టిస్తూ హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కపట నాటకాలు ప్రదర్శించి పేదల రక్త మాంసాలు పిండుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండలకార్యదర్శి కందుకూరి కోటేష్, సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి, కోమండ్ల గుర్వయ్య, నల్లబోతు సోమయ్య, చంద్రశేఖర్, అరెకంటి రాము, కోదండ చరణ్రాజు, రాములు పాల్గొన్నారు.