Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
నవతెలంగాణ దినపత్రికలో ఉపాధి హామీలో అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అధికారుల్లో చలనం మొదలైంది.డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం విచారణ అధికారిగా అడిషనల్ డీఆర్డీఏ, కోదాడ ఏపీడీ డాక్టర్ పెంటయ్యను నియమించారు.శుక్రవారం మున్యానాయక్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టటారు. విచారణలో సంబంధిత ఫిర్యాదుదారులనుండి, గ్రామస్తుల నుండి,సంబంధిత ఉద్యోగుల నుండి జరిగిన సంఘటన పై పూర్తి సమాచారం సేకరించారు.నవ తెలంగాణ దినపత్రిక నిజాలను నిర్భయంగా రాయడంతో ప్రజలు నవతెలంగాణ దిన పత్రికను అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి,ఎంపీవో గోపీ, ఏపీవో నాగయ్య, సర్పంచ్ బానోతు బికారు,ఉపసర్పంచ్ బానోతు వెంకన్న, వార్డు సభ్యులు బానోతు శ్రీను, గ్రామపెద్దలు ధరావత్ సాగర్, మేట్లు వీరన్న, నాగు, రాజేందర్, ఉపాధికూలీలు సైదమ్మ, మంగమ్మ, కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు.