Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏ సంఘం జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ వంగూరి రాములు
- కలెక్టరేట్ ఎదుట మూడో రోజు నిరాహార దీక్ష
నవతెలంగాణ- భువనగిరిరూరల్
వీఆర్ఏలకు పేస్కెల్ జీవోను వెంటనే విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని ఆ సంఘం జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ వంగూరి రాములు, వెంకటేశం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలపైన రాష్ట్ర సంఘం జేఏసీ కమిటీ ఇచ్చిన పిలువులో భాగంగా కలెక్టరేట్ ఎదుట మూడో రోజు శుక్రవారం నిరాహార దీక్షల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సెప్టెంబర్9న శాసన సభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓలను రద్దు చేసి వీఆర్ఏలకు పే-స్కెల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2017 ఫిబ్రవరి24న వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి 5 ఏండ్లు 5 నెలల కావస్తున్నా నేటికి అమలుకు నోచుకోలేదని వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించని ఎడల పోరాటం ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం, జేఏసీ చైర్మెన్ దాసరి వీరన్న , కో-చైర్మెన్్ పసుల రమేష్ , జనరల్ సెక్రెటరీ గోరుకంటి వెంకటేశం,కన్వీనర్ స్వామి, జిల్లా సినీయర్ నాయకులు బోళ్ల బాషయ్య,గిరి వివిధ మండలాల అధ్యక్షులు పెంటయ్య,ఏడ్ల వెంకటేశం,గడ్డం శ్రీనివాస్, ఉషయ్య, మైసయ్య, కోట నర్సింహ, నర్సింహ, కష్ణ, శ్రీనివాస్, నాయకులు బోయిన నర్సింహ నాయకులు నవనీత, ధనలక్ష్మి, సంతోష ,సాయి, బిక్షయ్య నాయకులు బింగి శ్రీనివాస్,మాధవరెడ్డి, అర్జున్, జానీ పాల్గొన్నారు.