Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట : బీజేపీ ప్రభుత్వం పేదలపై పన్నుల భారాన్ని మోపుతూ సంపన్నులకు మేలు చేసేదిగా విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తుందని సీపీిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, కక్కిరేణి గ్రామాల్లో నిత్యావసర వస్తువులపై, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించటాన్ని నిరసిస్తూ సీపీిఐ(ఎం) గ్రామ శాఖల ఆద్వర్యంలో ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువులపై పన్నులను తగ్గించాలని, పాలు, పాల ఉత్పత్తులపై విధించిన జిఎస్టిని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బడుగు రమేష్, సిపియం మండల కార్యదర్శివర్గ సభ్యులు బల్గూరి అంజయ్య, వేముల సైదులు, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, కన్నెబోయిన యాదయ్య, పాల సంఘం చైర్మన్ దాడి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రాపోలు బాస్కర్, దోమలపల్లి నర్సింహ్మ,కూనూరు శ్రవణ్, కంకల శేఖర్, గాదె కష్ణ, కూనూరు రమేష్, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
బొమ్మలరామరం : కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాలపై చేసిన జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పని చేస్తుందని పేద మధ్య తరగతి వర్గాల పైన పన్నుల భారాన్ని వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రేకల శ్రీశైలం నాయకులు మెలరం లక్ష్మయ్య , యాదయ్య, పున్నమ్మ, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్ : కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై తాజాగా పెంచిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించు కోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. పాలు, బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఎం మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మోత్కూర్, మండలంలోని పాలడుగు గ్రామంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ రాములమ్మ, కందుకూరి నర్సింహ, మెతుకు అంజయ్య, తాటి కరుణాకర్, దడిపల్లి ప్రభాకర్, కొంపల్లి ముత్తమ్మ, పిట్టల చంద్రయ్య, చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, కొంపల్లి గంగయ్య, వెండి యాదగిరి, దడిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, తంగడపల్లి, చౌటుప్పల్ పట్టణకేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా మాట్లాడారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ విధించి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పేదల జేబులు కొల్లగొట్టి బడా వ్యాపారుల జేబులు నింపుతుందన్నారు. ప్రజల కనీస అవసరమైన పాలు, పెరుగు, బియ్యం, పప్పులు తదితర అనేక రకాల వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మెన్్ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆకుల ధర్మయ్య, చీకూరి ఈదయ్య, బొమ్మకంటి కష్ణ, మొగుదాల రాములు, బొడ్డు అంజిరెడ్డి, సిలివేరు జంగయ్య, దాడి సురేందర్‌రెడ్డి, దేప రాజు, పల్చం ఉత్తరయ్య, ఆకుల యాదమ్మ, బొమ్మకంటి జయమ్మ, మాధవి, జంగమ్మ, విఘ్నేశ్, ప్రకాశ్, శంకర్‌రెడ్డి, యాదిరెడ్డి, పార్వతమ్మ పాల్గొన్నారు.
వలిగొండ : 'ఒకే దేశం- ఒకే పన్ను' అంటూ తమకే సాధ్యమైన ఓ టక్కు టమారా నినాదం రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు . జీఎస్టీని నిరసిస్తూ మండల పరిధిలోని తుర్కపల్లి,పులిగిల్ల,కెర్చుపల్లి గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. తుర్కపల్లి, కెర్చుపళ్లి గ్రామాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు వెంకటేశం,కొమ్మిడి లక్ష్మారెడ్డి,బుగ్గ చంద్రమౌళి,తుర్కపల్లి శాఖ కార్యదర్శి గ్రామ ఉపసర్పంచ్ వెల్మకన్నె బాలరాజు,సిపిఎం మండల నాయకులు పల్సం స్వామి, మాజీ సర్పంచ్ సల్ల ఐలయ్య, సిపిఎం నాయకులు తుమ్మల సంజీవ రెడ్డి, వడ్డేమని వెంకటయ్య, వేముల ఆనంద్,వేముల నాగరాజు,తుమ్మల నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.