Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ దిష్టి బొమ్మ దహనం...
నవతెలంగాణ- భువనగిరిరూరల్
సోనియాగాంధీ పై ఈడీ విచారణకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి డీసీసీి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అవమానపరచడానికే ఈడీ ఆఫీసుకు పిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బీసుకుంట్ల సత్యనారాయణ, ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, కుక్క దూగు సోమయ్య, కోట పెద్ద స్వామి, మజహర్, నజీమా సలావుద్దీన్, కష్ణ యాదవ్, బెండ లాల్ రాజు,చిస్థి, నుచ్చు నాగయ్య యాదవ్, చిక్కుల వెంకటేష్ శివ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : కక్ష్యపూరితంగానే సోనియా గాంధీపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి , ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ధనవత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీ వనజ హన్మంత్ రెడ్డి, ప్రతిభ రాజేష్ నాయక్,జిల్లా బీసీ సెల్ కార్యదర్శి డోకేనా వెంకటేష్,మండల ఉపాధ్యక్షలు బోత రాములు,ఉపసర్పంచ్ వెంకటేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి నిఖిల్, మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బానోత్ వినోద్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు వల్లపు రమేష్, మల్లేష్, వెంకటేష్ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు అవిశెట్టి అవిలిమల్లు, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు మందుల సురేష్, కారుపోతుల వెంకన్న, మండల, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్లు మలిపెద్ది మల్లారెడ్డి, గుండు శ్రీను, ప్రధానకార్యదర్శి రాచకొండ బాలరాజు, పి.శేఖరాచారి, తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం: సోనియా గాంధీ పైన అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు సింగిర్తి మల్లేశం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రాంపల్లి మహేశ్ గౌడ్,ఎంపీటీసీలు ఎర్వ హేమంత్ రెడ్డి,శ్రీహరి నాయక్,ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు నందరాజ్ గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగం రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షుడు భైరగొని శ్రీనివాస్ గౌడ్,రామిడి జంగారెడ్డి, వెంకటేశ్, రాజునాయక్, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాపాడడం కాంగ్రెస్తోనే సాధ్యమని మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి.జమీరోద్దీన్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియాగాంధీని ఈడీ కేసులో విచారణకు పిలవడం వెనుక మోడీ రాజకీయ కుట్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిఏజాస్, జానీ, ,మహుబుఅలీ, శంగిశెట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు.