Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మహిళలు ఆర్థిక స్వలాంభన సాధించడానికి కృషి చేయాలని అప్పుడే కుటుంబంతో పాటు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని హంస పౌండేషన్ చైర్మెన్్ చెరుకు లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హంస ఉచిత కుట్టు మిషను శిక్షణా కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ గోధాసు శిరీష పధ్వీరాజ్, తెలంగాణ ఇంటి పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కె చాంద్లతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పూర్తయిన అనంతరం ధ్రువీకరణ పత్రం కూడా అందజేయపడుతుందని తెలిపారు. స్థానిక సర్పంచ్ గోధాసు శిరీష పధ్వీరాజ్, ఎంపీటీసీ ఎండి.రేహన్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని స్వశక్తి తో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు హంస, హంస పోండేషన్ బాధ్యులు పోరెండ్ల విప్లవ కుమార్, సంఘపాక సతీష్, సర్దార్ రాజన్న, ఎస్కే లతీఫ్, దండిగా శోబా, బందెల అనిత, జ్యోతీ, శారద, అరుణ, సత్యవతి, నాగ జ్యోతీ, సరిత, మధురిమ, నిఖత్, ప్రసన్న, మధురిమ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.