Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రజలలో ప్రభుత్వ కళాశాలలపై ఉన్న అపోహను తొలగించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ రిటైర్డ్ కమిషనర్ చక్రపాణి అన్నారు.శుక్రవారం పట్టణంలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన విద్యార్థులను, అధ్యాపకులను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా సందర్శించారు.కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశమయ్యారు.అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అలాగే ఇంగ్లీషు పరిజ్ఞానం విద్యార్థులకు పెంచడం కోసం ప్రతిరోజు ఆంగ్ల పత్రికలను చదివించాలన్నారు.ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు, స్కూల్స్ బాగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయనే అపోహను ప్రజలలో నుంచి తొలగించుటకు అధ్యాపకులు,ఉపాధ్యాయులు వీలైనంత ఎక్కువ శ్రమించి ఫలితాలు సాధించాలన్నారు.విద్యార్థులకు భావవ్యక్తీకరణ చేసే పరిజ్ఞానాన్ని అధ్యాపకుడే అందించాలని ఇప్పుడు నడుస్తున్నదన్నారు.డిజిటల్ విప్లవం కనుక సైన్స్‌పై అవగాహనను పెంచడం కోసం విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా నిరంతర అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు.అలాగే తను వివిధ శాఖలలో అనేక ఉన్నత పదవులలో కొనసాగినప్పటికీ ఇంటర్ విద్యా శాఖలో పని చేసినప్పుడు ఎక్కువ తప్తినిచ్చిందన్నారు.ఐఏఎస్ చదివబోయే విద్యార్థుల కోసం తాను కూడా జూమ్ యాప్ ద్వారా కోచింగ్ ఇస్తానని, ఆసక్తి కలిగిన వారు కార్యక్రమం ఏర్పాటు చేసి పిలిస్తే వస్తానన్నారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ రేపాల శ్రీనివాస్ ఆయన్ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ సీఈ ఏడుకొండలు,కళాశాల సిబ్బంది అధ్యాపకులు శ్రీను, జ్యోత్స్న, దేవమణి, బషీరున్నీసాభేగం, లక్ష్మీనారాయణ,రేపాకుల గురవయ్య, వి.వాసు, వేముల వెంకటేశ్వర్లు, జి.యాదగిరి, మారంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రమౌళి, రత్నకుమారి,రమేష్, తిరుమల,గోపికష్ణ, ఫిజిక్స్ రమేష్, సైదులు, సుజాత, జ్యోతి,వీరయ్య, మమత, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.