Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
నిరుపేద యువతులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వరం లాంటివని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, ఎంఎల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి, మాట్లాడారు. కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలోని నిరుపేద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకం ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే పైళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వధూవరులకు పట్టు చీర, పట్టుదొతి కండువా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జెడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య,మండల అధ్యక్షులు జనగాం పాండు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కంచి మల్లయ్య,మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్ గౌడ్,జిల్లా నాయకులు బల్గూరి మధుసుదన్ రెడ్డి,జక్కా రాఘవేందర్ రెడ్డి, సర్పంచులు చిందం మల్లికార్జున్, బొయిని పాండు,బొమ్మారపు సురేష్,కస్తూరి మంజుల శ్రీశైలం,జిలుగు కవిత సతీశ్ పవన్,చిన్నం పాండు,నాయకులు నల్లమాస సత్యనారాయణ,కస్తురి పాండు,సిల్వేరు మధు , ర్యకల శ్రీనివాస్ పాల్గొన్నారు.