Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు
- జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో కరోనా కలకలం
- కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ- నార్కట్పల్లి
కరోనాతో కలవరం వద్దని అలా అని అప్రమత్త త మరువద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు పేర్కొన్నారు. పట్టణ శివారులో గల మూసీ జ్యోతిబాపూలే బాలుర జూనియర్ కళాశాలలో 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్థానిక వైద్యాధికారులతో తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి కొండల్ రావు శుక్రవారం ఆ కళాశాలను సందర్శించారు. కళాశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు ఉన్నట్టు అందులో ఒక విద్యార్థి జలుబు జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వైద్య నిమిత్తం వచ్చారని,.. విద్యార్థికికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని... తద్వారా గురువారం ఆ కళాశాలలో మరో 50 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించినట్లు డీఎంహెచ్ఓకు స్థానిక వైద్యులు వివరించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ . ఇంకా కరోనా ముప్పు పోలేదని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక వైద్యాధికారి లహరి, కళాశాల ప్రిన్సిపాల్ భవాని పాల్గొన్నారు.
కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే చిరుమర్తి
జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కరుణ పాజిటివ్ వచ్చిందని తెలుసుకొని నకరికల్లు శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఆ కళాశాలను సందర్శించి అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు వాజిద్ అలీ ఉన్నారు.