Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి
- ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పిల్లల ఎదుగుదల వివరాలను పోషణ్ ట్రాకర్ యాప్, స్పెషల్ గ్రోత్ డైవ్లో సమగ్రంగా నమోదు చేయాలని ఐసీడీఎస్ పీడీ జ్యోతి పద్మ సూచించారు.శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీడీపీఓలు,సూపర్వైజర్లు,పోషణ అభియాన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లకు పిల్లల ఎదుగుదల గుర్తింపు,నమోదు అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీకేంద్రాల నిర్వహణ పూర్తిస్థాయిలో ఆన్లైన్లో జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా యాప్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ టీచర్ అయిదేళ్ల పిల్లల కచ్ఛితమైన ఎత్తు, బరువులను నిర్దేశించిన పరికరాలతో గుర్తించి గ్రోత్ మానిటరింగ్ కార్డులో నమోదు చేసి యాప్లో ఎంటర్ చేయాలన్నారు.ప్రతిరోజు అంగన్వాడీ కార్యక్రమాలను యాప్లో పొందుపర్చాలని సూచించారు.పోషణ్ ట్రాకర్ యాప్లో గ్రోత్ మానిటరింగ్, గహసందర్శనలు 80 శాతం పొందుపరుస్తె సదరు టీచర్లకు నెలకు రూ.500,ఆయాకు నెలకు రూ.250 చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.శిక్షణ పొందిన సిబ్బంది సెక్టార్స్థాయిలో టీచర్లకు మరింత అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త పి.సంపత్, సీడీపీఓలు విజయలక్ష్మి, అనంతలక్ష్మి, శ్రీవాణి, శ్రీజ, రూప, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ హుసేన, సూపర్వైజర్లు ,పోషణ్ అభియాన్ సిబ్బంది, టీచర్లు పాల్గొన్నారు.