Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడటాన్ని గమనించి బీజేపీ ప్రభుత్వం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై లేనిపోని ఆరోపణలతో ఈడీ కార్యాలయానికి విచారణ కోసం పిలిపించి వేధిస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆరోపించారు. అందుకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం సమీపంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నిర్వహించిన భారీ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా పార్టీ బలపడడాన్ని జీర్ణించుకోలేక నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సహించరానిదన్నారు.రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని దేశంలోని ప్రతిపక్ష నాయకుల గొంతుకలను బీజేపీ నాయకత్వం అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటివెంకన్న యాదవ్,రాష్ట్ర, జిల్లా,మండల నాయకులు,యువజన, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ విభాగాల నాయకులు పాల్గొన్నారు.