Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్నభోజనం, ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వైద్యఆరోగ్య పరీక్షలు వంటి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుదన్నారు.విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతలక్ష్యాలను చేరుకోవాలన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని ఈ సంస్థను ఆదర్శంగా తీసుకుని మరికొన్ని సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలన్నారు. దాతల సహకారంతోనే పాఠశాలల అభివద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, వెంపటి మధుసూదన్, టౌన్ పార్టీ అధ్యక్షులు చందునాగేశ్వరరావు, ఎంఈఓ సలీం షరీఫ్, స్థానిక కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రవణ్, అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు, నీలా సత్యనారాయణ, ట్రస్ట్ గౌరవాధ్యక్షులు నాగుబండి రంగా,రాజశేఖర్, సుధాకర్, చిన్నకేశవరావు, సాంబశివరావు, బండారు శ్రీనివాస్‌రావు, వెంకట్రత్నం, పోటు రంగారావు, సాయి, కోటి, స్వర్ణభారతి ట్రస్ట్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.