Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
వర్షాకాలం నేపథ్యంలో ప్రబలనున్న సీజనల్ వ్యాధుల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆశాలు, మెప్మా ఆర్పీలకు వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు.ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారన్నారు.వర్షాకాలంలో నీటి గుంటల్లో నీరు నిలిచి దోమలు వద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, బోదకాలు వ్యాధులను వ్యాపింపజేస్తాయని పేర్కొన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తమ ఇంటి పరిసరాల్లోని గాబులు, నీటి తొట్లు, కొబ్బరిబొండాలు, పాతటైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.పట్టణంలోని 48 వార్డులకు 48 స్ప్రేయింగ్ మిషన్లు పంపిణీ చేయడంతో పాటు 5 ఫాగింగ్మిషన్ల ద్వారా దోమల మందు పిచికారీ చేస్తున్నట్టు వివరించారు. అలాగే నీరు నిలిచినకుంటల్లో ఆయిల్‌బాల్స్ వేస్తున్నట్టు తెలిపారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా కార్యకర్తలు, ఆర్పీలు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాలని కోరారు.మున్సిపల్ అధికారులు సిబ్బంది వీధుల్లో నిలిచిన నీటిని, చెట్టును వెంట వెంటనే తొలగించాల న్నారు.మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ముఖ్యంగా నీరు, గాలి, మంచి ఆహారం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాజియా, రమ్య, శ్రీరామ్, నర్సయ్య, కృష్ణమూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగంట్ల శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, డీఈ సత్యారావు, మెప్మా జిల్లా అధికారి రమేష్, ఎస్ఎస్ఆర్.ప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.