Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగంటలు చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లకు పైగా వెళ్లొచ్చు
- వైర్లెస్యాంటీ తెఫ్ట్ దీనిలో ప్రత్యేకతలు
- రూ.45 వేలకు ఎలక్ట్రికల్బైక్
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన కుర్రోడు ఎలక్ట్రికల్ బైక్ తయారుచేసి గ్రామస్తులను అందర్ని అబ్బురపరుస్తున్నాడు.మండలపరిధిలోని యర్రవరం గ్రామానికి చెందిన పెండెం బచ్చయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అతని కుమారుడు పెండెం అజరు హైదరాబాదులోని గురునానక్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.అజరు ఎలక్ట్రికల్ బైక్ను అతిచౌకగా రూ.45 వేలతోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా బైక్ను తయారు చేశాడు.దీనిలో 3 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించాడు.మూడు స్పీడ్ మోడ్లు ఉంటాయని మొదటి మోడ్లో 25 కిలోమీటర్స్ స్పీడుతో 130 కిలోమీటర్లు పైగా వెళ్లొచ్చు.రెండవమోడ్లో 35 నుండి 40 కిలోమీటర్ల స్పీడుతో 120 కిలోమీటర్ల పైగా దూరం వెళ్లవచ్చు.మూడవ మోడ్లో 50 నుండి 55 కిలోమీటర్ల స్పీడుతో 70 నుండి 80 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చని తెలిపాడు.దీనిలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం 40 యాంప్స్ ఉపయోగించాడు.డిజిటల్ మీటర్ ద్వారా ఎంత వేగంతో వెళుతున్నట్లు తెలుసుకోవచ్చని, దీనిలో ముఖ్యమైన ప్రత్యేకత వైర్లెస్ యాంటీ తెఫ్ట్ నీ ఉపయోగించినట్టు తెలిపాడు.దీనివల్ల వాహనాన్ని రిమోట్ ద్వారా స్టార్ట్ చేయవచ్చని దీనిని ఒకవేళ దొంగలించాలని ప్రయత్నిస్తే వెనుకచక్రం కదలకుండా ఆగిపోతుందని తెలిపాడు.అంతేకాకుండా రెండు చక్రాలకు సస్పెన్షన్ ఏర్పాటు చేశాడు.దీనిపై 150 నుండి 200 కేజీల వరకు బరువు మోయగలదు.బ్యాటరీని సొంతంగా తయారు చేశానని, అంతేకాకుండా తన నివాసంలో సోలార్ ఇన్వర్టర్, సోలార్ మోటార్లను తయారుచేసినట్టు తెలిపాడు.ప్రభుత్వం సహకరిస్తే అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తానని తెలిపాడు.అజరు చేస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలు చూసి గ్రామస్తులు పలువురు నాయకులు అభినందించారు.