Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యక్తిగత అదనపు కార్యదర్శి డీఎస్వీ శర్మ ఇతరులపై అక్రమ కేసులు పెట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ ముసుగులో అక్రమ దందాలు చేస్తూ,భూకబ్జాలకు పాల్పడు తున్నాడని ఆరోపి ంచారు.బాలెంల శివారు లోని 836 సర్వే నెంబర్ లో సేద్యం చేస్తున్న సుధాకర్‌రావుపై కేసులు పెట్టి ఆయన భూమిపై పనులు చేస్తున్నారన్నారు.ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ సేద్యం చేస్తూ 2015 నుండి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వ పదవులలో ఉన్న ఆయన మంత్రి అండతో టీఆర్ఎస్ ముసుగులో పోలీసులతో అరాచకాలు సష్టిస్తున్నారని మండిపడ్డారు.ఇటువంటి వ్యక్తులు పార్టీకి అనుబంధంగా ఉండడం వల్లనే టీఆర్ఎస్ కబ్జాలకు నిలయంగా మారిందన్నారు.పేదల భూములపై కన్ను పడ్డ టీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ అండతో భూమార్పిడి చేస్తున్నారన్నారు.గతంలో ఇలాంటి పరిపాలనే కొనసాగించిన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిని ప్రజలు ఓటుతో దెబ్బ కొట్టారన్నారు.ఈ సమావేశంలో బాధితుడు ముప్పిడి సుధాకర్‌రావు,పార్టీ జిల్లా కార్యదర్శి సలిగంటి వీరేంద్ర,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మీర్‌అక్బర్,పల్స మల్సూర్, వల్దాస్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.