Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పెన్‌పహాడ్ మండలంలోని చీదేళ్ల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగి ఐదేండ్లు కావొస్తున్నప్పటికీ నేటికి లబ్దిదారులను గుర్తించలేదని, వెంటనే పేదలకు పంచాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.ఆదివారం ఆ గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లను పార్టీ బృందం పరిశీలించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద పేదల కోసం 1999 లో సర్వే నెంబర్ 477,478,లో దేవరం సత్యనారాయణరెడ్డి, కడెం గోపిరెడ్డి, కడెం నారాయణమ్మ, ఎడ్ల శేషమ్మ, చౌర్యాల వెంకటమ్మ,పరెడ్డి లచ్చిరెడ్డి,బాదే బిక్ష్మయ్య, బాదే లక్ష్మయ్య, తుమ్మల లింగయ్య దొంతిరెడ్డి సీతమ్మ, 9 మంది రైతుల నుంచి 15 ఎకరాల 22 గుంటల భూమిని కొనుగోలు చేసిందని వివరించారు.325 మందికి ఇండ్ల స్థలాలకు లేఅవుట్ చేశారన్నారు.పేదలకు పంచాల్సి ఉండగా రాజకీయ కారణాలతో పట్టాలు ఇవ్వకుండా అపారని పేర్కొన్నారు.2016లో టీిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేసి 125 మందికి ఇండ్లు కట్టించారని ఇండ్లు నిర్మాణం జరిగి పంచకపోవడంతో ఇండ్లు శిథిలావస్థకు చేరాయన్నారు.రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు.పెన్‌పహాడ్ మండలంలో సింగారెడ్డి పాలెంలో 105 ఇండ్లు నిర్మించి లభ్డిదారులకు పంచారని కానీ చీదేళ్ల గ్రామంలో పేదలకు పంచకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రణపంగికృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మేధారమెట్ల వెంకటేశ్వర్లు, దేవరం వెంకటరెడ్డి, మడ్డి అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు మిట్టగడుపులముత్యాలు, చినపంగి నర్సయ్య, నెమ్మాది అడివయ్య, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి పాల్గొన్నారు.