Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తిస్థాయిలో హాజరుకాని అధికారులు ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-వేములపల్లి
గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు మాసాలకు చేపట్టే మండల సర్వసభ్య సమావేశం అధికారులు ,ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయి హాజరు కాకపోవడంతో వృధా అవుతున్నాయి .వివరాల్లోకి వెళితే మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం 11 గంటల సమయంలో ప్రారంభించి గంటన్నరలో ముగించారు. సర్వసభ సమావేశానికి సమయపాలన లేకుండా హాజరుకాగా, మరి కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు గైర్హజరయ్యారు. సమావేశంలో ఖాళీ కుర్చీలతో సమావేశం వెలవెల పోయింది. వచ్చిన అధికారులు సైతం మొక్కుబడిగా తమ నివేదికను సెకండ్ వ్యవధిలో చదివి వినిపించి ముగించారు. సమావేశానికి విద్యుత్ అధికారి హాజరు కాకపోవడం పై సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఏఈ గైర్హాజరపై కలెక్టర్ ఫిర్యాదు చేయాలని సభలో తీర్మానం చేశారు .అదేవిధంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విదుల్లోకి తీసుకోవాలని తీర్మానం చేశారు. అనంతరం ఎంపీపీ పుట్టల సునీత కురుపయ్య మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిదులు సమావేశానికి హాజరుకావాలని, సమన్వయంతో మండల అభివద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్ రెడ్డి, ఎండిఓ దేవిక ,ఎమ్మార్వో వెంకటేశం ,ఎంపీటీసీలు చైతన్య ,వీరయ్య, సర్పంచులు ఝాన్సీ ,పద్మ , కృష్ణవేణి, నాగలక్ష్మి, లక్ష్మి ,అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.