Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజవర్గంలో మౌలికవసతులు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
- సాగునీరు కోసం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల జాడేది..?
- బచావో మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు నియోజకవర్గం ఏరుపడి ఏండ్లు గడుస్తున్నప్పటికీ స్థానికంగా పార్టీలో పనిచేసే నాయకులకు ప్రకటనలకు ప్రచారాలకే పరిమిత మవుతున్నారు తప్ప మునుగోడు నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలబడేందుకు స్థానికేతర్లకు మునుగోడు గడ్డ అడ్డాగా మారిందని బచావో మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి మండిపడ్డారు ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం రాజధానికి కూత పెట్టు దూరంలో ఉన్నప్పటికీ అభివద్ధిలో ఆమడదూరంలో ఉందన్నారు.నియోజకవర్గ రైతులకు అవసరమైన సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయన్నారు.ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు, తాగునీరు నోచుకోక రైతులు, ప్రజలు అవస్థలతో అల్లాడుతున్నారని మండిపడ్డారు.నక్కలగండ,ి డిండి ఎత్తిపోతల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నత్తనడకన సాగుతున్నాయన్నారు.శేషలేటి వాగు పనుల ఊసే కరువైందని, ప్రాజెక్టుల పూర్తి కోసం స్థానిక నాయకులకు ఉన్న శ్రద్ధ స్థానికేతర్లకు ఉండదని పదవుల కోసం సవితి తల్లి ప్రేమ చూపిస్తారే తప్ప కన్నతల్లి ప్రేమ కనపడడం లేదని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా నియోజకవర్గంలోని ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక నాయకులకు మద్దతుగా నిలవాలి తప్ప డబ్బు, ధనంతో నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు వచ్చే స్థానికేతర్లను రాబోయే ఎన్నికలలో తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ వైస్‌ఎంపీపీ కర్నాటి లింగయ్య, పందుల మల్లేష్, ఉప్పర బోయిన నర్సింహ, గుర్రాల ఎల్లయ్య, ఓయూ జేఏసీ నాయకులు మాలిగలింగస్వామి, వంగూరి రామచంద్రం, విజాక్, బేరి కష్ణయ్య, గోసుకొండ రవి, గుర్రాల సురేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ జనార్దన్, సురేష్ పాల్గొన్నారు.