Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమన్ షోటోఖాన్ కరాటే చైర్మెన్,సినీ నటుడు సుమన్
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణతో పాటు శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని సుమన్ షోటోఖాన్ కరాటే చైర్మెన్, సినీ హీరో సుమన్ అభిప్రాయపడ్డారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీగార్డెన్స్లో నిర్వహించిన నేషనల్ కరాటే చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే చాంపియన్ 2022 పోటీలకు ఆయన ముఖ్యఅతిథిóగా హాజరై ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తాను మద్దతుగా నిలిచానని, హైదరాబాదుకు తాను 1989 లో వచ్చి స్ధిర నివాసం ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు.నాటి నుండి తెలంగాణ ప్రజలు తనపై చూపిన ప్రేమ ఆదరణలకు రుణపడి ఉంటానని తెలిపారు.సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అలుపెరుగని పోరాటం చేశారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అభివద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మహిళల రక్షణ కొరకు పార్లమెంటులో చట్టం తీసుకుని రావడానికి మహిళా ఎంపిలు కషి చేయాలని ఆయన కోరారు.దేశంలో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు మహిళలకు రక్షణ కల్పించడం లేదని, చట్టాలను మార్చవలసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్,మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,జెడ్పీ వైస్చైర్మెన్ గోపగాని వెంకటనారాయణ,సుమన్ యువసేన అధ్యక్షుడు గుండా వెంకన్న,పట్టణసీఐ ఆంజనేయులు,ప్రముఖ వైద్యులు రామ్మూర్తి, చల్లా లక్ష్మికాంత్,చల్లా లక్ష్మి ప్రసాద్,కరాటే మాస్టర్లు జల్లల శ్రీనివాస్,చిన్న రమణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.