Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, హరితహారం, నర్సరీలు తదితర అంశాలపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పంచాయతీ అధికారులను ఆదేశించారు.ఆదివారం మండలం లోని పెద్దవూర, లింగంపల్లి, పోతునూరు గ్రామాల్లో పారిశుధ్యం ,హరితాహారం,నర్సరీలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిధిలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రకతి వనాలను అభివద్ధి చేసినట్లయితే గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని తెలిపారు. నర్సరీలలోని మొక్కలను ఎప్పటికప్పుడు సంరక్షించాలని తెలిపారు.గ్రామాల్లో మురుగుకాల్వలు, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు,వీధి లైట్లు వెలిగేలా, పారిశుధ్యపనులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఆయన వెంట ఎంపీడీఓ విజయకుమారి, కార్యదర్శి డాకునాయక్ ఉన్నారు.