Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోపగోని సుజాత సంతాపసభలో అఖిలభారత్ కిసాన్ సంఫ్‌ు జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మనువాద విధానాలకు ప్రత్యామ్నయం మార్క్సిస్టు విధానాలని అఖిలభారత కిసాన్‌సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలో మాజీ వార్డు సభ్యురాలు గోపగోని సుజాతసంతాప సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.చిన్న వయస్సులో గుండెపోటుతో సుజాత మరణించడం కుటుంబానికే కాక పార్టీకి తీరని లోటన్నారు.పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు ఆమె పాత్ర మరువలేనిదన్నారు.గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలుగా పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కషి చేసిందని తెలిపారు.సీపీఐ(ఎం)లో పాతతరం వెళ్తుంటే కొత్తతరం రావాల్సిన సమయంలో ఇలాంటి నాయకత్వం అకాలమరణాలు బాధాకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేది సీపీఐ(ఎం) మాత్రమేనని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, కార్పొరేట్వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నాయని తెలిపారు.వారి దోపిడీ నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు.ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీకార్యకర్తలను గత ప్రభుత్వాలు హత్యలు చేసి కమ్యూనిస్టులు లేకుండా చేయాలని కుట్రలు జరిగాయన్నారు.అయినా కమ్యూనిస్టు పార్టీ లేకుండా చేయడం ఎవరి తరం కాలేదని తెలిపారు.కమ్యూనిస్టు పార్టీలకు ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటారని పేర్కొన్నారు.గతంలో పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలో వచ్చిన సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పామని అన్నారు.ఆ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కషి జరుగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను రాజకీయ పార్టీల ఎజెండాగా మార్చడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోడీ పాలనలో ఏడుసార్లు భారత్‌బంద్ జరిగిందని చెప్పారు. కమ్యూనిస్టులు పార్లమెంట్లో గతంలో 60 మంది ఉన్నప్పుడు ఉపాధిహామీ చట్టం అటవీ హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు.ఆగస్టు మాసం నుండి మరోసారి 510 రైతుసంఘాల ఆధ్వర్యంలో రైతుచట్టాలపై నిరసనలు తెలుపుతామన్నారు. సుజాత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సుజాత భర్త,మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోనిలక్ష్మణ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్, జిల్లా కార్యదర్సివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం,వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, యండి. పాషా, సిరిపంగి స్వామి, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ, మండల కార్యదర్శి గంగదేవి సైదులు,మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం,నాయకులు యండి. ఖయుమ్, బోరేం నర్సిరెడ్డి,ఉష్కగుల రమేష్,ఉష్కగుల శ్రీనివాస్, దండ అరుణ్‌కుమార్, బత్తుల విప్లవ్, గోశిక కరుణాకర్, ఆకుల ధర్మయ్య, బత్తుల లక్ష్మయ్య,బత్తుల దాసు,బద్దం అంజయ్య, కొండె శ్రీశైలం, అయిలయ్య, వెంకటేష్, కశిం,గణేష్ తదితరులు పాల్గొన్నారు.