Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రెండు రోజుల క్రితం వైయస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న గురుకులాలకు మహాత్మ జ్యోతిరావుఫూలే పేరు పెట్టడం సరికాదని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి బీసీ గురుకులాలుగా మార్చాలని ఆర్ కష్ణయ్య పేర్కొనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు.ఆర్.కష్ణయ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, కర్నాటి నిరంజన్, కోట వెంకటరమణ, మారోజు రాజ్ కుమార్, గొబ్బిళ్ళ అనిల్, కుమార్, శివరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.