Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 మంది రక్త వితరణ
- ప్రారంభించిన సీఐ వెంకటయ్య
నవతెలంగాణ-నారాయణపురం
మండలంలోని పుట్టపాకలో అమరవీరుల 23 వ వర్ధంతి సందర్భంగా డీివైఎఫ్‌ఐ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది.ఆమరవీరుల స్మారకభవనం ఆవరణలో మర్రి నర్సిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డితో కలిసి స్థానిక సిఐ వెంకటయ్య ప్రారంభించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వారు రక్తాన్ని సేకరించారు.41 మంది యువకులు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొని రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకువచ్చారు.నల్లగొండకు చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి సంస్థ వారు రక్తదాతలకు పండ్లు, జ్యూస్ అందజేశారు.ఈ సందర్భంగా సీఐ రుకొండ వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి యేటా అమరవీరులను స్మరించుకుంటూ అపద సమయంలో ప్రాణాలను నిలిపేలా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.యువకులు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం మంచి పరిణామమన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్ఎన్అర్ ట్రస్ట్‌తో పాటు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కమిటీలు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ పుట్టపాకలో యువకులు అనేక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.అమరుల ఆశయ సాధనకు ఇలాంటి కార్యక్రమాలే దోహద పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ యుగేందర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, ఎంపిటిసి సభ్యులు, ట్రస్ట్ చైర్మన్ మర్రి వసంత, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, గ్రామ డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు కొత్త శ్రీకాంత్, దోంతగాని అమరేందర్, వంగురి సాయికిరణ్, సుక్క రవి, నడికుడే నర్సింహా, పిట్ట ప్రసాద్, గాజుల మహేష్, ముంత సాయి, కర్నాటి శ్రవణ్, దోంతగని రవి, కర్నాటి నరేష్ పాల్గొన్నారు.