Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
జీఎస్టీ పెంపులో భాగంగా ముందు సంచుల్లో నింపి ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గ నవీన్, సూదగాని సత్యరాజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని శర్భనాపురం గ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పెంచిన జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెరుగుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.75 ఏండ్లకాలంలో బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ఆహార పదార్థాలు,రోజువారి అవసరాలైన పాలు, పెరుగు, మాంసం, చేపలు, పన్నీరు, బెల్లం వంటి వాటిపై ఎన్నడూ పన్నులు విధించలేదని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ కార్యదర్శి సిరిగిరి సారయ్య, నాయకులు కారెరాజు, బుగ్గ ఎర్రయ్య, గడ్డమీది యాదగిరి, అంగడి నగేష్, సైదాపురం నరేష్, బుగ్గ ప్రవీణ్, సూదగాని సాగర్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి : పాల ఉత్పత్తులు, యంత్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని పాడి రైతుసంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులు, అనుబంధ యంత్రాలపై విధించిన జీఎస్టీకి వ్యతిరేకిస్తూ ఆదివారం పాడి రైతు సంఘం, సిపిఐఎం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, కాచారంలో సంతకాల సేకరణ జరిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి పోశెట్టి, విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మెన్ జోగు శ్రీనివాసు, సర్పంచ్ జమ్ము శంకర్, జమ్ము కొమురయ్య,కాళ్ళే మల్లేష్, జోగు బసవయ్య, అజ్మీరా కిషన్, రేగుమల్లేశం, జాజిల్లాపురంఈశ్వర్, నేలపట్లశంకర్, వంటేరు పెంటారెడ్డి,దుంపలరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్రూరల్ :కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేద ప్రజలపై భారాలు వేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కష్ణారెడ్డి విమర్శించారు.మండలంలోని పెద్దకొండూరు, తూర్పుగూడెం, సింగరాయచెరువు, మందోళ్లగూడెం, పంతంగి గ్రామాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, మండల కమిటీ సభ్యులు జక్కడి రాంరెడ్డి, కొండే శ్రీశైలం, బోయ యాదయ్య, గ్రామ శాఖ కార్యదర్శిలు లింగస్వామి, సప్పిడి లక్ష్మారెడ్డి, కొండే అంజయ్య, అంతటి అశోక్, మంద బుచ్చిరెడ్డి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.