Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.జీఎస్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని వాణిజ్య భవన్సెంటర్లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఆహారపదార్థాలపై జీఎస్టీని విధించి ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని దూరం చేస్తుందన్నారు.పెట్టుబడిదారులకు,కార్పొరేట్‌శక్తులకు లాభాలు చేకూర్చుతూ పేద,మధ్యతరగతి ప్రజలపై ధరల భారాలు మోపడం సిగ్గుచేటన్నారు.పాల ఉత్పత్తుల తయారీకి వినియోగించే పరికరాలు,యంత్రాలపైన 12 శాతం నుంచి 18శాతం జీఎస్టీ విధించడం సరికాదన్నారు.దేశంలో కోట్లాదిమంది పిల్లలకు అవసరమైన పాలపై కూడా జీఎస్టీ వేయడం దారుణమన్నారు.పాలు, పెరుగు,పన్నీరు, నెయ్యి, పిండిపదార్థాలు విద్యార్థులకు ఉపయోగపడే పెన్సిల్స్, పుస్తకాలు, చివరికి శ్మశానవాటికలను కూడా వదలకుండా పన్ను విధించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదన్నారు.ఇప్పటికే పెరిగిన గ్యాస్,పెట్రోలు,డీజీల్ నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై జీఎస్టీతో అదనపుభారాలు మోపడం ఏంటని ప్రశ్నించారు.ధరలభారంతో ప్రజల జీవన పరిస్థితులు చిన్నాభిన్నమవుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు, కొలిశెట్టియాదగిరిరావు, కోటగోపి, ఎలుగూరి గోవింద్,దండావెంకటరెడ్డి,ఎల్గూరి జ్యోతి, జె.నర్సింహారావు, చిన్నపంగి నర్సయ్య, వీరబోయిన రవి, నాయకులు రణపంగకష్ణ, రోశపతి, మామిడిసుందరయ్య, బచ్చలకూరిస్వరాజ్యం, కాంపాటి శ్రీను, దండ శ్రీనివాస్‌రెడ్డి, సైదులు, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.