Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జున సాగర్
ఎగువ శ్రీశైలం జలాశయం గేట్లను సోమవారం మూసివేశారు. దీంతో శ్రీశైలం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 1000 క్యూసెక్కుల వరద దిగువన ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు వచ్చి చేరుతుంది.దీనితో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమ క్రమంగా పెరిగి సోమవారం క్రష్ట్ గేట్లను తాకింది .దీనితో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 545.50 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 199.9570 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం,కుడి కాలువ,ఎడమ కాలువ,ఎస్ఎల్బీసీి ద్వారా 1000 క్యూసెక్కుల నీరు ,లోలేవల్ కెనాల్ ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు.జలాశయం నుండి దిగువకు 1000 క్యూస్సేక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.