Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆలేరు టౌన్
ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వితీయ స్థానం సాధించిందని, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ ,ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో సోమవారం పీఏసీఎస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే 23 కోట్ల 68 లక్షల గ్రాస్ ఫ్రాఫిట్‌తో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దూసుకువెళుతోందన్నారు.తాను బాధ్యతలు చేపట్టినప్పుడు మొదటి సంవత్సరం 11 కోట్లు వద్ధిరేటు సాధించిందన్నారు .రెండవ సంవత్సరం 51శాతం వద్ధి రేటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు .మొదటి స్థానం కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉందన్నారు.ఈ విజయం వెనుక డీసీసీబీ పరిధిలోని బ్యాంకు మేనేజర్లు ,సూపర్వైజర్లు సిబ్బంది కషి ఉందన్నారు .ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 9 వందల కోట్ల టర్నోవర్ కాగా,ప్రస్తుత టర్నోవర్ 1850 కోట్ల గా గ్రాస్ పెరిగిందన్నారు .ముఖ్యమంత్రి కెసిఆర్ , మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు ,ఎమ్మెల్సీలు
తన విజయం వెనుక ఉన్నారన్నారు . నాబార్డు ద్వారా డీసీసీబీకి ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ కింద బహుళ హార్డ్ ప్రయోజనాల కొరకు సహకార సంఘాల బలోపేతం కొరకు 4 శాతం వడ్డీకి 1 కోటి చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భవనం ఏర్పాటు చేయడం తో పాటు , చిరు వ్యాపారాలకు 8శాతం శాతం వడ్డీ చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 37 సంఘాలు అర్హత సాధించాయని , మరో70 నుండి 80 సంఘాలకు అవకాశం కల్పించేందుకు కషి చేస్తామని వివరించారు . ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ కేంద్ర సహకార బ్యాంకులో రూ.9 కోట్ల 16 లక్షలు పక్క దారి పట్టగా,అందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రూ. కోటి 16 లక్షలు తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు..తదుపరి విచారణకు ఈ కేసును సీబీ సీఐడీకి అప్పగించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మొగ్గలుగానే మల్లేశం, వైస్‌చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి , మున్సిపల్ చైర్మన్ వి శంకరయ్య ,బొమ్మలరామారం పీఏసీఎస్ చైర్మన్ జి .బాలనర్సయ్య, ఆలేరు పీఏసీఎస్ సీఈవో ఇందూరు వెంకటరెడ్డి, ,పీఏ సీఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.