Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల వస్తువుల పై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కష్ణ అన్నారు. జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణకేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు బందెల ఎల్లయ్య, వనం యాదగిరి, చింతల శివ,పర్వతం బాలకష్ణ, బండి రవి, కౌకుంట్ల మల్రెడ్డి, జవాది గణేష్, గుమ్మడి ప్రేమ్, జవాది నాగేందర్, సునీత పాల్గొన్నారు.
చౌటుప్పల్‌రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచడమే కాకుండా జీఎస్ట్టీి విధించడం దారుణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పంచి పెడుతుందన్నారు. వెంటనే జీఎస్టీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కమిటీ సభ్యులు చింతల సుదర్శన్, నాయకులు చింతపల్లి నర్సిరెడ్డి, ఆకుల ధర్మయ్య, గడ్డ కోటి జంగయ్య, ఎలక రాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : జీఎస్టీ పన్నుల పేరుతో పాడి రైతుల నుండి ,పాడి పైసలను ప దోచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రకం కుట్రకు తెరలేపిందని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ అన్నారు .మండల కేంద్రంలో సోమవారం బస్టాండ్ చౌరస్తా ఆవరణలో పాడి రైతుల నుండి జీఎస్టీ పేరుతో పన్నుల భారం మోపవద్దని కోరుతూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు . ఈ సందర్బంగా పీఏ సీఎస్ మాజీ చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ పన్నుల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త రకం దోపిడీకి పాల్పడుతోందన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేష్, ఘనగాని మల్లేశ్,ఎలుగల శివ, మొరిగాడి అశోక్ ,చెక్క పరశురాములు, ముసలోజు హరీష్ , భాస్కర్ ,ఘనగాని రాజు, యాదగిరి, భువనగిరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.