Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ నుండి నిధులు మంజూరు చేసిన అడ్డంకులు సష్టించిన అధికారులు
- సర్పంచ్ పోరాటంతో దిగొచ్చిన అధికారులు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట నుండి పెద్ద కందుకుర్ గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్డు మరమ్మతులు పనులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి.ఇంతకుముందే గ్రామపంచాయతీ నుండి రోడ్డు మరమ్మత్తుల కోసం 12 లక్షలు మంజూరు చేసి ప్రారంభానికి శంకుస్థాపన చేసిన అధికారులు అనుమతించకపోవడంతో పనులు వాయిదా పడుతూ వచ్చాయి.అధికారులు కొంతమంది ప్రజాప్రతినిదుల వైఖరి నిరసిస్తూ గ్రామ సర్పంచ్ భీమ గాని రాములు వినూత్న రీతిలో పోరాటం చేయడంతో అధికారులు దిగి వచ్చారు. దీంతో పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామానికి వచ్చే రోడ్డు మరమ్మతులకు ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో తామే పంచాయతీ నుండి నిధులు మంజూరు చేయించుకున్నామని అయినా కూడా గ్రామ అభివద్ధిని గిట్టని వారు అధికారులు అడ్డుపెట్టుకొని పనులు జరగనియడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా మరవత్తు పనులు ప్రారంభం చేసుకోవడం ఆనందంగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ భీమగాని మాదవి , గ్రామస్తులు పాల్గొన్నారు.