Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
- ఆలేరు పట్టణంలో పీర్ల కొట్టం ప్రారంభం
- హాజరైన డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు .పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అబ్బాసి అలామ్ అశుర్ ఖానా ( పీర్ల ) కొట్టమును టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి తో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ముస్లింల సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించిందన్నారు. షాదీ ముబారక్ వంటి మహత్తర పథకానికి శ్రీకారం చుట్టి 18 ఏండ్లు నిండిన అడబిడ్డల వివాహాలకు రూ.1,00,116 నగదు సాయం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఇంటి పెద్ద దిక్కుగా అందజేస్తున్నారన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మసీదుల మరమ్మతులకు, పీర్ల కొట్టాల నిర్మాణాలకు రూ. 2 కోట్లా 8 లక్షలు నిధులు మంజూరు చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తూ , సంక్షేమం, ప్రాంత అభివద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆమె వివరించారు .
ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం గొంగిడి మహేందర్ రెడ్డి
ఇమామ్, మౌజన్లకు నెలనెలా గౌరవ వేతనం అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మతం, కులం ప్రతిపాదికన పని చేయదని, యావత్ ప్రజా సంక్షేమమే గౌరవ సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ,జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి , మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్, భేతి రాములు ,రాయపురం నర్సింహులు ,మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎండి.రియాజ్ ,టీిఆర్ఎస్ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ సునీత పరామర్శ
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ వడ్డేమాన్ శ్రీనివాసులు ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మతి చెందారు. మండల కేంద్రంలో సోమవారం పట్టణంలోని ఆయన నివాసం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు .ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం రజక సంఘం వత్తిదార్ల సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాసులు ఎనలేని కషి చేశారన్నారు .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్ సోదరుడు, వడ్డేమాన్ బాలరాజు ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జి .నాగరాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేశం, కోటగిరి ఆంజనేయులు,లక్ష్మీనారాయణ , అంజన్ కుమార్ , బాలరాజు తదితరులు పాల్గొన్నారు.