Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి సాగరు ముంపునకు గురైన డీ ఫామ్ పట్టా ఉన్నవారికి పట్టాపాస్ బుక్కులు జారీ చేయాలని, పట్టా సాగుదారులను అధికారులు, పోలీసులు నిర్భందం చేయొద్దని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కునురెడ్డి నాగిరెడ్డి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు.సోమవారం నియోజకవర్గంలోని చందంపేట మండలం పెద్దమూల గ్రామంలో నాగార్జునసాగర్ ముంపునకు గురైన భూనిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.నాగార్జునసాగర్ డ్యామ్‌లో వందల గ్రామాలు ముంపునకు గురై సర్వం కోల్పోయి పెద్దమూల గ్రామం అప్పటి ప్రభుత్వం 1964 రిజర్ ఫారెస్ట్ భూమిని డీఫామ్ సర్టిఫికెట్ ఇచ్చి పట్టా పాస్ బుక్కు ఇచ్చారన్నారు.నాటి నుండి నేటి వరకు దాదాపు 1000 ఎకరాల భూమిని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారన్నారు.ఇటీవల ఫారెస్ట్ అధికారులు, పోలీసులు హరితహారం పేరుతో చుట్టూ కందకాలు తవ్వి పట్టా భూములలో మొక్కలు పెట్టి రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేయడం బాధాకరమ న్నారు.ఈ ప్రాంతంలో కొంతకాలంగా యురేనియం ఖనిజాలు ఉన్నాయని శాంపిల్ సర్వే చేయడం జరిగిందన్నారు.అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములను లాక్కునేందుకు పెద్దఎత్తున కుట్ర చేస్తున్నాయన్నారు.ధరణి పేరుతో పట్టా భూములను ( పీఓబీ) నిషేధిత జాబితాలో చేర్చి రైతుబంధు, రైతు బీమా, రుణసౌకర్యం లేకుండా చేశారన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయకార్మికసంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మద్దిమడుగు ఏసోబు,మాసారం శీనయ్య, సీపీఐ(ఎం) నాయకులు ఉప్పునుంతల వెంకటయ్య, భిక్షమయ్య, రామానుజులు, సాగుదారులు పాల్గొన్నారు.