Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
విద్యార్థి ఉద్యమాలే సామాజిక మార్పుకు శోధక శక్తి అని,అందుకు అనేక ఉద్యమాలను విద్యార్థి సంఘాల నాయకులు ముందుండి నడిపించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్రెడ ి్డఅభిప్రాయపడ్డారు. సోమ వారం జిల్లాకేంద్రంలో జరిగిన పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణాతరగతులకు ఆయన హాజరై మాట్లాడారు.జాతీయ ఉద్యమం నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు అన్ని ఉద్యమాల్లో విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించా రన్నారు.ప్రస్తుతం నెలకొన్న సామాజిక, సాంస్కతిక, ఆర్థిక, రాజకీయ అసమా నతలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడా లని పిలుపునిచ్చారు.విద్యను సరుకుగా మార్చి లక్షలాది రూపాయల వ్యాపారాన్ని కార్పొరేట్ శక్తులు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.ఆ ఉద్యమాలపై పీడీఎస్‌యూ నాయకత్వం సమరశీల పోరాటాలు కొనసాగుస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీడీఎస్‌యూ అధ్యక, కార్యదర్శి రవిచంద్ర,రామ్మోహన్,న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్,సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్, శ్రీకాంత్ శ్యామ్,శ్రీకాంత్, రాజేశ్వర్ ,రాష్ట్ర సహాయకార్యదర్శి గౌతమ్‌కుమార్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.