Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు యుద్ధప్రతి పాదికన చర్యలు చేపట్టామని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు.సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుండి సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు.డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధుల నివారణకు యుద్ధప్రతిపాదికన పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు 6 నమోదయ్యాయన్నారు.జిల్లాలో వైద్యాధికారులతో పాటు అనుబంధ శాఖల అధికారులు నిరంతరం వ్యాధుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని,లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు నమోదైన చోట ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే ఆ ప్రాంతంలో 50 నుండి 100 ఇండ్లను పరిశీలించి సత్వరచర్యలు చేపట్టాలని ఆదేశించారు.అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో అవసరమని వ్యాధుల నివారణపై ప్రజలకు పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.శుక్రవారం, ఆదివారం గ్రామ, పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని అలాగే చేపట్టిన పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు.జిల్లాలో బూస్టర్ వ్యాక్సినేషన్లో వేగం పెంచాలని వైద్యాధికారులను ఆదేశించారు.ఈ కాన్ఫరెన్స్‌లో అదనపుకలెక్టర్ పాటిల్హేమంత్కేశవ్,జెడ్పీ సీఈఓ సురేష్, డీపీఓ యాదయ్య,డీఎంహెచ్ఓ కోటాచలం,జిల్లా అధి కారులు,మున్సిపల్ కమిషనర్లు,ఎంపీడీఓలు పాల్గొన్నారు.