Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం
- రూ.1.20 లక్షల నగదు స్వాధీనం
- వివరాలను వెల్లడించిన ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో ఏడాదిన్నర కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురుదొంగలను పోలీసులు సోమవారం పట్టుకున్నారు.అరెస్టుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు.పట్టణంలో ఏడాదిన్నర కాలంగా పట్టణంలోని ఎమ్మెస్నగర్, భవానినగర్, శ్రీమన్నారాయణకాలనీ, గోపిరెడ్డినగర్, కట్టకొమ్మలగూడెం రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎనిమిదిండ్లలో దొంగతనాలు చేసిన దొంగలు పోలీసులకు చిక్కారు.పట్టణానికి చెందిన నాగదాసరి ఓనేసీమూస్, కొల్లూరి సాయిప్రకాష్, మునగంటి గోపీల ముఠాగా ఏర్పడి ఇండ్లలో దొంగతనాలుచేయడమే వృత్తిగా ఎంచుకున్నారు.కాగా సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్లు సీఐ నరసింహారావు, ఎస్ఐలు నాగభూషణరావు, రాంబాబు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఈ ముగ్గురు అనుమానస్థితిలో కనిపించగా వారిని పట్టుకొని విచారించారు.గత నెల 16 వ తేదీన ఎంఎస్నగర్లోని భూక్యా పార్వతీ నివాసంలో దొంగతనానికి పాల్పడ్డారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది ఇండ్ల చోరీ చేసినట్లు పోలీసులు విచారణలో నేరం అంగీకరించారు.వారి నుండి పోలీసులు 32 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.20 లక్షల నగదు, ల్యాప్ట్యాప్, హోండాయాక్టివాబైక్, 3 ఎల్ఈడీ టీవీలు, నాలుగు స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి మొత్తం విలువ రూ.20 లక్షల వరకు ఉంటుంది.నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ వెంకటే శ్వర్రెడ్డి, పట్టణ సీఐ నర్సింహారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పట్టణ ఎస్సైలు ఎస్.రాంబాబు, ఎం.నాగభూషణ్రావు, సీసీఎస్ ఎస్సై నరేష్, సిబ్బంది వెంకన్న, సతీష్, ఎల్లారెడ్డి, రామారావు, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.నగదు రివార్డులు ఇస్తామన్నారు.