Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
పట్టణంలోని రోడ్లను మరమ్మతులు చేయడంలో అధికారులు మొద్దు నిద్రను విడనాడాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన పట్టణంలోని ఈశ్వర్ మూవీమహల్ నుండి భారత్ గ్యాస్ కార్యాలయం వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు.అదే సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివద్ధి చేసింది శూన్యమన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్,పట్టణ అధ్యక్షులు అంజద్‌అలీ, కౌన్సిలర్లు బైరు శైలేందర్,కెక్కిఱేని శ్రీనివాస్, మడిపల్లి విక్రమ్,నాయకులు పోలగాని బాలుగౌడ్,చంచల శ్రీనివాస్,మద్ది శ్రీనివాస్ యాదవ్,ఆలేటిమాణిక్యం,రావుల రాంబాబు,నరేందర్‌నాయుడు, సాయి పాల్గొన్నారు.