Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
ఎన్నికలు ఉంటేనే ప్రభుత్వానికి ప్రజా సమసలు గుర్తుకొస్తాయా అని టీడీపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి జక్కలి ఐలయ్యయాదవ్ ఆరోపించారు. మండలకేంద్రంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిం దన్నారు.బ్యాంకుల్లో రూ.లక్ష వరకు పంటరుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తానని చెప్పి మూడున్నరేండ్లవుతుందన్నారు.రాష్ట్రంలో 36 లక్షలా68 వేల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మాఫీ చేయాల్సి ఉండగా మూడున్నరేండ్ల కాలంలో రుణమాఫీ కోసం 1148 కోట్ల రూపాయలను విడుదల చేసి కేవలం 5లక్షలా 66 వేల మందికి మాత్రమే మాఫీ చేశారని,మిగతా రైతులను విస్మరించారని ఆరోపించారు. మిగిలిన 31 లక్ష మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు.ఏకకాలంలో లక్ష రూపాయలను రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.రాచకొండ భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.మంత్రి జగదీశ్‌రెడ్డి సమస్యలు పరిష్కరించ కుండా పర్యటన చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. .నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పి ఇంతవరకు పట్టించు కోలేదన్నారు. డిండిఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో భూనిర్వాసితులకు పరిహారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిం చారు. .నియోజకవర్గంలో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు సరైన పద్ధతిలో స్పందించడం లేదన్నారు.అందుకే నియోజక వర్గంలో ప్రజలందరూ ఉపఎన్నికలు జరిగితేనన్నా తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారన్నారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పగడాల లింగయ్య, నాయకులు పుప్పాల యాదయ్య, కాసర్ల అంజయ్య,ఈద కృష్ణ, మహేష్ పాల్గొన్నారు.